అనసూయ ఒకవైపు యాంకర్ గా, మరొకవైపు నటుడిగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తన మాటలతో అందాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అందాల ఆరబోతలో ఎప్పుడు ముందుంటుంది నటి అనసూయ.
మొదటిసారిగా క్షణం సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించింది. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో రంగస్థలం సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం పుష్ప సినిమాలో కూడా ఒక విభిన్నమైన క్యారెక్టర్లు నటించింది అనసూయ.
తాజాగా అనసూయ సంపత్ నంది డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం జబర్దస్త్ షో కి యాంకర్ గా పనిచేస్తోంది. ఇక సినిమాలతోపాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది అనసూయ. తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక తన ఫ్యామిలీతో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్లను పోస్ట్ చేస్తూ ఉంటుంది అనసూయ. అనసూయ వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఇంకా కుర్ర హీరోయిన్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.