ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. రెబల్ స్టార్ ఫోటో వైరల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రభాస్ వస్తున్న తాజా చిత్రం రాదే శ్యామ్. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు చిత్ర యూనిట్ సభ్యులు. పరమహంస పాత్రలను రెబల్ స్టార్ కృష్ణంరాజు నటిస్తున్నారట. అందుకు సంబంధించి అఫీషియల్ గా మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక ఈ ఫోటో విషయానికి వస్తే కృష్ణంరాజు మహా జ్ఞాని అయిన పరమహంస పాత్ర కోసం ఒక ఏడాది నుంచి గడ్డం పెంచుతున్నట్లు గా సమాచారం.

ప్రభాస్ కృష్ణంరాజు కలిసి నటిస్తున్న మూడో సినిమా ఇది.. అంతకుముందు వీరిద్దరూ కలిసి బిల్లా రెబల్ వంటి సినిమాలలో నటించారు. రాదే శ్యామ్ చిత్రానికి రాధా కృష్ణ కుమారి డైరెక్షన్ వహిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇందులో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు ఉన్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా ప్రభాస్ వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు చెప్పవచ్చు.

Share.