ఫ్యాన్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఏమైందంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ముంబైలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అతి పెద్ద భారీ స్టేజ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ స్టేజ్ పైన ఎన్టీఆర్ తన అభిమానులతో మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముంబైలో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలకు ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ , దర్శకుడు రాజమౌళి , ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈవెంట్లో పాల్గొన్నారు.. ముంబై ఈవెంట్ కి ఎన్టీఆర్ ని చూడడానికి ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు..

ఈవెంట్ ప్రారంభం నుంచి హంగామా చేస్తూ గట్టిగా అరుస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఈవెంట్ కి సరికొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకొచ్చారు.. అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ని చూసి వారు ఆనందం తట్టుకోలేక భారీకేడ్లు.. ఇతర నిర్మాణాలు పైకెక్కి గోల చేశారు… ఇక ఎన్టీఆర్ అభిమానుల కోలాహలాలూ, అరుపులు ఈవెంట్ కి అడ్డంకిగా మారాయి.. దీంతో కరణ్ జోహార్ భారీగా అసహనం వ్యక్తం చేశారు.. ఎన్టీఆర్ అన్న ఎలాగైనా సరే మీ అభిమానులను మీరే ఆపండి.. మేము ఆపలేము అంటూ అనడంతో ఇక ఇది గమనించిన ఎన్టీఆర్ వెంటనే రియాక్ట్ అయి తన అభిమానులను హెచ్చరించారు. పైకి ఎక్కడాన్ని తప్పుపడుతూ.. పద్ధతిగా లేదు క్రిందకుదిగండి.. దిగుతారా..? దిగరా..?కిందకి దిగి.. ఎంజాయ్ చేయండి ..మన గురించి అందరూ చాలా చక్కగా మాట్లాడుకోవాలి అని పదేపదే తనదైన స్టైల్లో గాంభీర్య స్వరంతో హెచ్చరించడం జరిగింది. ఇక తర్వాత ప్రీ రిలీజ్ వేడుక చాలా సక్సెస్ ఫుల్ గా ముగిసింది.

Share.