మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఇందులో మెగాస్టార్ తనయుడు కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఆచార్య సినిమా విడుదల తేదీ మారుతుంది అని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రసారాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయాల పై స్పందించిన చిత్రబృందం ఆ వార్తల్లో వాస్తవం లేదు అంటూ అధికారికంగా ప్రకటించింది. ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆచార్య సినిమా వాయిదా పడుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయంపై నిర్మాత స్పందిస్తూ.. ఆచార్య సినిమా రిలీజ్ డేట్ మారుతుంది అన్న వార్తలు నిజం కాదు.. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ముందుగానే ప్రకటించిన విధంగా ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తాం తెలిపారు. తాజాగా ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.