ఫిదా సినిమా తో కుర్రకారు గుండెలను ఫిదా చేసిన సాయి పల్లవి.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి ప్లాష్ బ్యాక్ లో మనకు కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి ఒక డిఫరెంట్ రోల్ పోషిస్తోంది.. అదే దేవదాసీ పాత్ర.. అయితే ఈ పాత్ర తెలియగానే చాలా మంది దేవదాసీలు అంటే ఎవరు..? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు..? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది..? అనే విషయాలను తెలుసుకోవడానికి తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
ఇకపోతే నేటి తరానికి దేవదాసీల గురించి తెలిసే అవకాశమే లేదు.. అందుకే సాయి పల్లవి ఆ పాత్ర చేస్తోంది అనేసరికి ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇక ఈ దేవదాసీలు అంటే దేవునికి మాత్రమే అంకితమైన స్త్రీలు అని చెప్పవచ్చు.. అంటే దేవతను ప్రసన్నం చేసుకోవడానికి చిన్నారులను దేవాలయాలకు అంకితం చేస్తారు వారి తల్లిదండ్రులు. ఇక సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న వర్గానికి చెందిన బాలికలు.. ఈ ఆచారానికి బలవుతున్నారు.. నేటికీ ఈ దేవదాసీ వ్యవస్థను నిషేధించినప్పటికీ మరికొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతూ ఉండటం దురదృష్టకరం.