తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. వరుస సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక తెలుగుతో పాటు హిందీ తదితర భాష చిత్రాల్లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. నిజానికి ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ డ్రగ్స్ కేసులో ఈమె పేరు ప్రముఖంగా వినపడింది. దాంతో ఆ వివాదం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక తన పుట్టినరోజు నాడు ప్రేమ విషయాన్ని కూడా బహిర్గతం చేసింది. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
సినీ ఇండస్ట్రీలో నటీనటులు పాత్ర డిమాండ్ చేస్తే ఏ పాత్రలో చేయడానికైనా సిద్ధం అవుతారు..కానీ రకుల్ ప్రీతిసింగ్ మాత్రం ఆ ఒక్క పని మాత్రం నేను చేయను అని చెబుతోంది.. ఏమిటంటే బరువు పెరగడం.
తగ్గడం లాంటివి చేయమంటే మాత్రం తన వల్ల కాదని రకుల్ ప్రీత్ సింగ్ తేల్చి చెప్పేసింది.. పెరగడం, తగ్గడం అనేది నాచురల్ ప్రాసెస్ అని ఎప్పుడు పడితే అప్పుడు పెంచడం , తగ్గించడం అంటే బాడీ పై తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుందని.. భవిష్యత్లో అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయని అందుకే ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ తప్పు సినిమాల కోసం అస్సలు చేయనని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.