ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నది ఎక్కువగా పుష్ప సినిమా గురించే. ఇందులో అల్లు అర్జున్, రష్మిక సుకుమార్ కాంబినేషన్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఇంతకాలం అల్లు అర్జున్ చేసింది అన్ని స్టైలిష్ క్యారెక్టర్లే.. కానీ మొదటిసారి ఒక ఊరు మాస్ క్యారెక్టర్లో కనిపించారు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా కథని రెండు విభాగాలుగా నిర్మించాలనుకున్నారు డైరెక్టర్ సుకుమార్. ఇక ఈ సినిమాకి నిర్మాణ సంస్థగా మైత్రి మూవీస్ చేపట్టారు.
ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ 250 కోట్లకుపైగా జరిగినట్లు సమాచారం. అయితే మొదటి రోజు కలెక్షన్లు బాగా సాధించినప్పటికీ.. ఆ తర్వాత సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఇక ఇందులో కథానాయికగా రష్మిక నటించింది.
ఇక సమంత ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇక ఇందులో సినిమా చూసిన వారంతా కేవలం అల్లు అర్జున్ నటన గురించే మాట్లాడుకుంటున్నారట. ఇక హీరోయిన్ గురించి కాస్త మాట్లాడుతున్నప్పటికీ.. ఇక ఈ సినిమాలో సమంతా కోసం వెళ్లిన వారికి ఈ పాట ఏమీ అర్థం కావడం లేదట. సమంత ఫేస్ లో ఐటెం సాంగ్ కు కావలసిన ఎక్స్ప్రెషన్స్ కనిపించలేదని.. ఈ సినిమాలో ఈమె నటించడం మైనస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈమె మొహం చూడాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.