బుల్లితెరపై ప్రసారమయ్యే వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షోలలో.. బిగ్ బాస్ కూడా ఒకటి. ఇక 19 మందితో మొదలైన తెలుగు బిగ్ బాస్-5 తుది దశకు చేరుకుంది. దీంతో ఈ సీజన్ బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం పై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నెటిజన్స్. అయితే తాజా సమాచారం ప్రకారం.. సన్నీ విజేతగా నిలిచి నట్లు తెలుస్తోంది.
దీనితో సెకండ్ ప్లేస్ లో సింగర్ శ్రీరామ్ ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం హౌస్ లో మానస్, సిరి, షణ్ముక్, శ్రీరామ్, సన్నీ ఉన్నారు. ఇక బిగ్బాస్ సీజన్ విజేతగా నిలిచే కంటెస్టెంట్ కు 50 లక్షల ప్రైజ్ మనీ తో పాటు. ఒక బైక్ ను కూడా అందించనున్నారు. ఇక రన్నర్ గా నిలిచిన కంటెస్టెంట్ లకు మాత్రం..25 లక్ష్యలు అందించనున్నారు. అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే రేపటి దాకా వేచి ఉండాల్సిందే. ఇక రేపటి రోజున బిగ్ బాస్ విన్నర్ -5 విజేత ఎవరో తెలుస్తుంది.