పుష్ప టీమ్ కి రామ్ చరణ్ స్పెషల్ విషెస్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కి అలాగే పుష్ప టీమ్ కి స్పెషల్ విషెస్ తెలపడంతో ప్రస్తుతం ఈ వార్త కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైన విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా మూవీ గా వచ్చిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో గత రెండు సంవత్సరాల నుంచి భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అంటూ పలువురు ప్రముఖులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

Apart From Allu Arjun & Ramcharan,these Are The Other Talents To Watch Out From The Family
తన ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ షేర్ చేస్తూ.. బన్నీ.. పుష్ప చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. సుకుమార్ గారు మీ కృషి అసమానమైనది. విజన్ మనసుకు హత్తుకునేలా ఉంది.. ఇక్కడ విడుదల కోసం ఎదురుచూస్తున్న రష్మిక మందన కు, పుష్ప టీమ్ కు ఆల్ ద బెస్ట్ అని తెలిపారు. ఈ మేరకు రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యల పట్ల అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ విషెస్ కి చాలా ధన్యవాదాలు త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తారు అని ఆశిస్తున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Share.