స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఇక ప్రమోషన్లలో కూడా ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. ఇక మేకప్ కోసం అయితే ఏకంగా కొన్ని గంటల సమయమే పట్టిందట. ఎలాగంటే ఉదయం 4:00 గంటలకు లేచి వెళితే ఐదు గంటలకి సెట్ లో ఉండేవారట.. ఇక ఆ తరువాత అప్పటి నుంచి 7 :00 గంటల వరకు మేకప్ వేసుకోవడానికే సమయం పడుతుందట.
అలా వేసిన మేకప్ లు తీయడానికి దాదాపుగా ఒక గంట సేపు సమయం పడుతుందట. ఇక ఈ పాత్ర ను చూపించడానికి మేకప్ బాయ్స్ చాలా కష్ట పడినట్లు సమాచారం. ఇక కేవలం మొహానికి కాకుండా.. మొత్తం శరీరానికి కూడా కొంతమంది కొన్ని సీన్లలో మేకప్ వేసుకున్నట్లు తెలియజేశారు అల్లు అర్జున్.
Wishing dear @alluarjun Director #Sukumar @iamRashmika @MythriOfficial & entire Team of @PushpaMovie All the Very Best!
You all have put your Blood,Sweat,Heart & Soul into this film! I wish all your efforts will be whole heartedly appreciated! Good Luck 👍— Chiranjeevi Konidela (@KChiruTweets) December 16, 2021
ఇక చిరంజీవి కూడా తన ట్విట్టర్ ద్వారా ..మీరందరూ ఈ సినిమాకి ఎంతో చెమట చిందించి, నిబంధనలతో పనిచేశారు, మీరు కష్టపడిన ఫలితం అంతా ఈ సినిమాలో కనిపిస్తుందని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.