[బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కేవలం పాన్ ఇండియా సినిమాలనే మాత్రమే చేస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్. ఆయన వ్యక్తిపరంగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా కూడా ఆదిపురుషో టీమ్ కు ఎంతో ఖరీదైన బహుమతులు ఇవ్వడం ద్వారా.. ఆయన ఏమన్నది ఫ్రూప్ అయిందని ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు.
ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కి.. 500 కోట్ల రూపాయల కు భారీగా బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ప్రభాస్ రాముడిగా, సీతగా కృతిసనన్ నటిస్తోంది. ఇక లక్ష్మణుడు పాత్రలో బాలీవుడ్ యంగ్ స్టార్ సన్నీ సింగ్ నటిస్తున్నారు. రావణుడి పాత్రలో సైఫ్అలీఖాన్ నటిస్తున్నారు. ఇటీవలే ఆది పురుష్.. సినిమాకు సంబంధించి షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు ప్రభాస్. ఆ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు ఖరీదైన రాడో రిస్ట్ వాచ్స్ ను వారికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక ఇదే కాకుండా గతంలో కూడా తన జిమ్ ట్రైనర్ కు..73 లక్షల విలువ చేసే ఒక రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు ప్రభాస్.
.#Prabhas gifted Rado watch to one of the technician of #Adipurush #Adipurushshootwrapup pic.twitter.com/WXvA7oZyUu
— Raju Garu Prabhas (@pubzudarlingye) December 13, 2021