చిరుకి నాతో చేసే దమ్ముందా అంటూ సవాలు విసురుతున్న బాలయ్య..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా అఖండ సినిమా విజయం తరువాత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న బాలకృష్ణ.. సినిమా విజయంపై ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ మల్టీ స్టారర్ మూవీ విషయంపై ఆయన రియాక్ట్ అయ్యారు. నిజానికి మంచి కథ దొరికితే మల్టీస్టారర్ మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని బాలకృష్ణ తెలిపారు. అయితే అవతలి వ్యక్తికి నాతో చేసే ధైర్యం ఉంటే.. నేను కచ్చితంగా మల్టీస్టారర్ మూవీ చేస్తాను అని బాలకృష్ణ తెలపడం గమనార్హం. బాలయ్య బాబు ఇలా మల్టీస్టారర్ మూవీ గురించి చెప్పడంతో మరోసారి చిరంజీవి, బాలకృష్ణ మల్టీ స్టారర్ మూవీ ఇష్యూ తెరపైకి వచ్చింది.

ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ వారు వీరిద్దరి కాంబినేషన్లో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారనే వార్తలకు బలం చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే బాలకృష్ణ ఇప్పుడు హింట్ ఇచ్చారని కొందరు చెబుతున్నారు..నిజం చెప్పాలంటే.. చిరంజీవితో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాలనుకుంటున్న బాలయ్యకు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.. అంతే కాదు నాతో చేసే సత్తా చిరుకి ఉంటే నేను మల్టీస్టారర్ మూవీ చేస్తానని ఇండైరెక్ట్ గా చెప్పినట్లు కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Share.