మొదటిసారి ఐటమ్ సాంగ్ లో మెరిసిన సమంత మంచి పాపులారిటీని తెచ్చుకున్నప్పటికీ, మరోపక్క తీవ్రంగా విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే సమంతాపై పురుష సంఘం కేసు పెట్టగా తాజాగా ఈ ఇష్యూ పై మాధవి లత కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే “ఊ అంటావా.. ఊ ఊ అంటావా..” అనే ఈ పాట పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా మగ వాళ్ళు అందరూ కామం తోనే ఉంటారు అని అర్థం వచ్చేలా ఈ పాట ఉందని, వెంటనే సినిమా లోనుంచి పాటను తీసేయాలని పురుష సంఘం ఆంధ్రప్రదేశ్ కోర్టును ఆశ్రయించడం జరిగింది.
ఫెమినిజం భావాలు పుష్కలంగా ఉన్న మాధవి లత కూడా షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఇకపై తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఇలా రాసుకొచ్చింది..”వాయమ్మో పుష్ప మూవీ సాంగ్ మీద కేసు అంటగా.. ఈ లెక్కన ఇండస్ట్రీలో 98% సాంగ్స్ అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీస్ చేయాలిక. ఇక నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతా. రారా సామీ సాంగ్ మీద కేసు వేస్తా. ఏంటి ఒక అమ్మాయికి మగాడిని చూస్తే, అతను పోతుంటే అంత చులకనగా వెంటపడి వెళ్ళిపోద్దా..? అబ్బాయి నడిచిన చోట భూమిని టచ్ చేసి మొక్కుతుందా ? ఒక మహిళ పరువు పోయింది. ఛ నాకు నచ్చలే.. నేను కూడా పెడతా కేసు. అంతే.. తగ్గేదేలే” అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది మాధవీలత. దీంతో మరోసారి సమంత స్పెషల్ సాంగ్ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది.