గుండు కొట్టించుకోవడానికి ఐదు లక్షలు డిమాండ్ చేసిన హీరో?

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో సుహాస్ అంటే పెద్దగా గుర్తు పట్టలేక పోవచ్చు కానీ, కలర్ ఫోటో ఫ్రేమ్ సుహాస్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు.కలర్ ఫోటో సినిమా ద్వారా యూత్ లో మంచి క్రేజ్ ను ఏర్పర్చుకున్నాడు.ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఫ్యామిలీ డ్రామా సినిమాలో నటించి మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం నాలుగు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవలే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకోసం సుహాన్ తన పారితోషికాన్ని పెంచినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అతను నటిస్తున్న ఒక్కొక్క సినిమాకు 40 లక్షలు పారితోషికం తీసుకుంటున్నాడు.కానీ ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ ప్రాజెక్టుకు మాత్రం 45 లక్షలు అనగా ఐదు లక్షలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడట.అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు. అసలు కారణం ఏమిటంటే ఆ సినిమా మొత్తం కూడా సుహాన్ గుండుతోనే కనిపించాలట.సుహాస్ నటిస్తున్న ఇతర సినిమాలు గుండుతో చేసే అవకాశం లేకపోవడంతో ఆ నష్టాన్ని భరించాలని మేకర్స్ ని కోరడంతో వాళ్లు కూడా సుహాస్ అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

Share.