తెలుగులో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటాడు హీరో దుల్కర్ సల్మాన్. డైరెక్టర్ శ్రీనాథ్ రాజేంద్ర డైరెక్షన్ లో తాజాగా తెరకెక్కించిన సినిమా కురుప్. ఈ సినిమాని వేఫర్ ఫిలిం మరియు M. స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ సినిమా థియేటర్లో విడుదల భారి విజయాన్ని అందుకుంది.ఇప్పుడు OTT లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.
ఈ రోజున నెట్ ఫ్లిక్స్ లో కురప్ సినిమా ప్రసారమవుతోంది. ఈ సినిమా ఒకేసారి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఇందులో ఇంద్రజిత్ సుకుమారన్, శోభితా ధూళిపాళ, సన్నీ వేన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకి సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక ఈ యువ హీరో మమ్ముట్టి కుమారుడు. ఒకే సినిమాని అన్ని భాషలలో మొదటిసారిగా విడుదల చేశాడు దుల్కర్ సల్మాన్.