బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 5 హౌస్ లో కంటెస్టెంట్ గా పాటిస్పెట్ చేస్తున్న మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. అయితే హీరోగా, విలక్షణ నటుడి గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక వరుసగా మంచి కథాబలం ఉన్న సినిమాలలో.. గుర్తుండిపోయే పాత్ర లను ఎంపిక చేసుకుంటూ తన నైపుణ్యాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన గేమ్ తో మెచ్యూర్డ్ థింకింగ్ తో అటు కుటుంబ ప్రేక్షకులను, ఇటు యువతిని బాగా ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సంవత్సరం అతను హీరోగా నటించిన క్షీరసాగరమధనం చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఆయన బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన టైమ్ లో అమెజాన్ ప్రైమ్ పోటీలో సినిమా విడుదల కూడా మంచి స్పందన లభించింది.
ఇకపోతే హౌస్ నుండి వచ్చిన వెంటనే మానస్ మరిన్ని ప్రాజెక్టులతో బిజీ కానున్నాడు. ఈ నేపథ్యంలోనే “5G లవ్ ” అనే చిత్రంలో హీరోగా ఎంపికయ్యాడు. ఇకపోతే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రం నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ ముదునూరు దర్శకత్వం వహిస్తుండగా.. స్క్వేర్ ఇండియా స్టూడియోస్ బ్యానర్ పై ప్రతాప్ కోలగట్ల సినిమాని నిర్మిస్తున్నారు.