రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్.. ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొనడానికి ప్రయత్నం చేస్తోంది చిత్ర యూనిట్.

Ee Raathale Lyrical Video Song | Radhe Shyam | Prabhas,Pooja Hegde | Justin Prabhakaran | Krishna K - YouTube
ఈ క్రమంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ త్వరలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న ఈ సినిమాకు.. ఈవెంట్‌ను కూడా అదే స్థాయిలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 23న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఊరట కలిగిస్తుంది అని అందరూ గట్టిగా నమ్ముతూ ఉండటం గమనార్హం. పెద్ద ఎత్తున టాప్ సెలబ్రిటీలు హాజరయ్యే ఈ ఈవెంట్ ని.. రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అంతే కాదు అదే రోజే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు అట.

Share.