సుమలత.. తెలుగు, కన్నడ, తమిళ్ తో పాటు ఇతర భాషల్లో సుమారుగా రెండు వందలకు పైగా సినిమాల్లో నటించి ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ప్రముఖ నటి సుమలత . 15 సంవత్సరాల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి .. మొదటిసారి రాజాధిరాజు అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. 11 సంవత్సరాల పాటు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈమె 1992లో అంబరీష్ ను వివాహం చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత సుమలత బెంగుళూరులో స్థిరపడ్డారు.
ఇక వీరికి అభిషేక్ అనే కుమారుడు కూడా జన్మించారు. 2019 ఎన్నికలలో మాండ్యా లోక్ సభ డివిజన్ నుంచి పోటీ చేసి సుమలత విజయం సాధించారు.. అయితే ఈమె ఒక ఇంటర్వ్యూలో తన భర్త గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా మంచి మనస్తత్వం ఉన్న వారని , అది నచ్చే ప్రేమించి వివాహం చేసుకున్నానని ఆమె తెలిపింది. ఆయన ముఖ్యంగా ఫ్యామిలీ కంటే ఫ్రెండ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని..ఆ కారణంగా తను జీవితంలో చాలా కష్టాలు పడ్డాను అని ఆమె తెలిపింది.
పెళ్ళైన కొత్తలో ఎవరైనా సరే ఏకాంతాన్ని కోరుకుంటారు.. కానీ ఆయన తన ఫ్రెండ్స్ తో సమయాన్ని గడుపుతూ ఉంటే నాకు ఇబ్బందిగా ఉండేది. అలా ఫ్రెండ్స్ గురించి మా ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాని.. వద్దని ఎంత చెప్పినా వినలేదు అని.. తనకు సహాయం చేయాలని పించింది కాబట్టే చేశానని వెన్నుపోటు పొడిస్తే అది వాళ్ళ కర్మ అని తన భర్త తనతో చెప్పేవారిని సుమలత తెలిపింది. 2018లో కిడ్నీ సమస్యల వల్ల ఆయన మృతి చెందారు.