బిగ్ బాస్ కాజల్ అందుకే ఎలిమినేట్ అయిందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కు సంబంధించి త్వరలో విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి కేవలం ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ వారం ఆర్జె కాజల్ హౌస్ నుండి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. దాదాపు 14 వారాల పాటు హౌస్ లో తన గేమ్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చిన కాజల్ టాప్ ఫైవ్ ను చేరుకోలేకపోయింది. కాజల్ కు ముందు నుంచి హౌస్ లో పలు రకాలుగా నెగిటివిటీ ఎదురైనా, తాను మాత్రం ఇంత కాలం గేమ్ మీదే దృష్టి పెడుతూ వచ్చింది. ఇకపోతే మానస్ , సన్నీ లతో ఉంటున్న తీరు తనకు హౌస్ లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా సపోర్ట్ పెంచేలా చేసింది.

RJ Kajal (Bigg Boss Telugu 5) Age, Sister, Husband, Family, Shows, Serials, Biography, Wiki & More
ఇకపోతే ఆమె ఎలిమినేట్ అవ్వడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి అనే విషయానికి వస్తే.. మిగతా వారితో పోల్చుకుంటే కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగానే ఉందని చెప్పాలి.. మిగతా హౌస్ మేట్స్ తో పోల్చితే టాస్క్ లో కూడా వెనుకబడి ఉంటుందని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి రెండు మూడు వారాల్లో ఎలిమినేషన్ నుంచి కూడా తప్పించుకుంది.. 14 వారాల పాటు ఉండగలిగినప్పటికీ ఒక్క సారి కూడా కెప్టెన్ కాలేకపోయింది. కంటెస్టెంట్ .. ప్రతి ఒక్కరితో కాజల్ గొడవ పడింది. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన చాలామంది కాజల్ తో తమకు ఎలాంటి కనెక్షన్ లేదు అని తెగేసి చెప్పేశారు. ఇలా మొదటి నుంచి నెగిటివిటీ ని మోసుకొస్తున్న కాజల్ చివరికి ఎలిమినేట్ కావడం గమనార్హం.

Share.