ప్రభాస్ హీరోగా, పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాని డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా పీరియాడిక్ లవ్ స్టోరీ తో నిర్మించబడుతుంది. అత్యధిక బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా జనవరి 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర మేకర్స్ ప్రమోషన్లలో వేగవంతం చేస్తున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా నుంచి వస్తున్న సబ్జెక్ట్ పరంగా సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నది. తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర మేకర్స్ మరొక స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఒక సాంగ్ ను టీజర్ రూపంలో విడుదల చేయనున్నట్లు గా తెలుస్తోంది. ఇక అంతే కాకుండా ఆ పాటకు సంబంధించిన న్యూ లుక్ పోస్టర్ ను కూడా తాజాగా చిత్రబృందం తెలియజేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ కాస్త వైరల్ గా మారుతోంది. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమా లోనే నటించడం గమనార్హం.
Get set to take flight with the next song from the #MusicalOfAges #RadheShyam. #UddJaaParindey #Sanchari #Raegaigal #SwapnaDoorame. Teaser out tomorrow at 1 PM!
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/1KR1q06IQc— Radhe Shyam (@RadheShyamFilm) December 13, 2021