అనసూయ బుల్లి తెరపై నటిస్తూనే .. వెండితెరపై సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంటోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా సుకుమార్ అనసూయకు ఛాన్స్ ఇచ్చి ఆమెకు మంచి ఇమేజ్ ను క్రియేట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏకంగా పాన్ ఇండియా సినిమా అయినా పుష్పా సినిమాలో అనసూయ కోసం ఒక ప్రత్యేకంగా దాక్షాయణి అనే పాత్ర రూపొందించారు. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 17వ తేదిన విడుదల కాబోతుంది కాబట్టి ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లో చాలా ఘనంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో అనసూయ మాట్లాడుతూ..నిజంగా ఇదంతా నాకు ఒక కలలా అనిపిస్తోంది.. రెండు సంవత్సరాలుగా ఎంతో మంది అభిమానులను చాలా మిస్ అవుతున్నాను.. బన్నీ కి నేను చాలా పెద్ద థాంక్స్ చెప్పాలి..ఎందుకంటే సాధారణంగా చాలామంది తమ కోరికలను అమ్మానాన్న లనో లేదా దేవుడినో మాత్రమే అడుగుతూ ఉంటారు. కానీ నేను ఒకరోజు స్టేజి మీదకు వచ్చినప్పుడు బన్నీతో నేను మీతో చేయాలని ఉంది.. అని అడిగాను. ఇక ఆలస్యం చేయకుండా కేవలం వారం రోజుల్లోనే నాకు ఫోన్ కాల్ వచ్చింది.. ఆ తర్వాత ఇదే కంటిన్యూ అవుతుంది అంటే.. నేను బన్నీని చాలా అడగాలి.. సినిమాలలో అవకాశాలు.. అంటూ ఆమె డబుల్ మీనింగ్ వచ్చేలాగా గ్యాప్ ఇచ్చి మాట్లాడడంతో అభిమానుల్లో మళ్లీ ఈలలు ,గోలలు మొదలయ్యాయి.