ఆ విషయంపై మళ్లీ మళ్లీ మాట్లాడనంటున్నా సమంత..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నాగచైతన్యతో సమంత విడాకుల వ్యవహారం తెలిపిన తర్వాత ఆ విషయంపై ఎంతోమంది ఇది ఎన్నో మాటలు అన్నారు. అయితే ఈ విషయంపై సమంత తనకు మాట్లాడం ఇష్టం లేదని తాజాగా తెలియజేసింది. సమంత రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మొదటిసారి తన విడాకుల వ్యవహారం పై స్పందించినట్లు సమాచారం. చైతన్య తో విడిపోయిన సమయంలో ఎంతో మానసికంగా కుంగుబాటుకు లోనయ్యానని, ఒక దశలో చనిపోవాలి అనుకున్నాను, అంటూ సమంత షాకింగ్ కామెంట్ చేసినది.

అయితే ఈ సంవత్సరం తనకు వ్యక్తిగతంగా ఏ విధంగా కలిసి రాలేదని సమంత తెలియజేసింది. అయితే చైతు తో విడాకులు అంశంపై సమంత స్పందిస్తూ.. మేమిద్దరం విడిపోవడం పై ఎంతోమంది పలురకాలుగా అనుకున్నారు. ఈ విషయంపై నాలో ఉన్న అభిప్రాయాన్ని తెలియజేశాను.. కాబట్టి మళ్లీ మళ్లీ ఆ అంశంపై మాట్లాడటం నాకు ఇష్టం లేదని సమంత ముక్కుసూటిగా చెప్పేసింది. దీన్ని బట్టి చూస్తే సమంత నాగచైతన్యను ఎంత ప్రేమిస్తుందో మనం భావించవచ్చు. ఏది ఏమైనా ఈ విషయం ఇప్పట్లో మర్చిపోయేలా లేరు నెటిజన్స్.

Share.