పునీత్ రాజ్ కుమార్ మరణం సినీ ఇండస్ట్రీలో జీర్ణించుకోలేకపోతున్నారు ఎంతో మంది సెలబ్రిటీలు.. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా అభిమానులు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా పునీత్ మరణాన్ని ఊహించుకోలేకపోతున్నారు. ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత ఒక రికార్డు సృష్టించడం విశేషం.2021 సంవత్సరం మరొక 15 రోజుల్లో పూర్తి అవుతుంది కనుక ఈ ఏడాది ఎక్కువగా గూగుల్ టాప్ లో సెర్చ్ చేసిన వారి లిస్ట్ ప్రకటించారు.
ఇక ఈ ఏడాది కూడా గూగుల్ టాప్ లిస్ట్ లో ఎవరున్నారో ప్రకటించిన గూగుల్, ఆ లిస్ట్ లో పునీత్ ఉండడం గమనార్హం. ఇక ఈ విషయం విన్న ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2021లో అత్యధికంగా వికీపీడియాలో వెతికిన వారి లిస్టులో గూగుల్ ప్రకటించిన ప్రకారం పునీత్ రాజకుమార్ ఉన్నట్టు తెలిపింది. అందులో టాప్ ప్లేస్ లో ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ కొంచెం ఆనందం గా, కొంచెం ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతున్నారు.