RRR మూవీ గురించి కొమరం భీమ్ మనవడు స్పందన..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న చిత్రం RRR ఈ సినిమా ఒక పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఏం దొర అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటిస్తున్నాడు.. ఇక ఎన్టీఆర్ గోండు బొబ్బిలి కొమురంభీం పాత్రలో నటిస్తున్నాడు. ఎన్నో భారీ అంచనాలతో ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై కొమరం భీం మనవడు కొమురం సోనే రావ్ స్పందించడం జరిగింది. కొమరం భీమ్ పోరాటాని ఈ సినిమా ద్వారా తెలపడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. కొమరం భీమ్ పోరాట చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తున్న రాజమౌళికి.. సోనే రావ్ ధన్యవాదాలు తెలియజేశారు

Share.