యువ హీరో ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో అభిమానులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇక ఈయన ఎన్నో సినిమాలు తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేయడం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఈయనకి ఒక సక్సెస్ కూడా రాలేదు. కొన్ని రోజులు ఎన్ని సినీ ఇండస్ట్రీ నుంచి కూడా బ్యాన్ చేయడం జరిగింది. అయితే తాజాగా హీరో శింబు ఆసుపత్రిలో చేరారట వాటి గురించి చూద్దాం.

తీవ్ర ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరిన తమిళ హీరో శింబు

హీరో శింబు కు తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిన్న తీవ్ర జ్వరం గొంతులో ఇన్ఫెక్షన్ రావడంతో శంభు ఆసుపత్రిలో చేరరట. అయితే మామూలు జ్వరమే తప్ప కరోనా కాదని వైద్యులు తెలిపినట్లు ఆయన సన్నిహితులు తెలియజేశారు. ఈ వార్త ఆయన అభిమానులకు తెలియగానే సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న.. వెందు తనిందదు కాడు. సినిమా షూటింగులో కొద్ది రోజుల నుంచి శింబు బిజీగా ఉన్నాడు. అయితే ఇక ప్రస్తుతం శింబు బాగానే ఉన్నట్లు సమాచారం.

Share.