సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్లు, పోస్టర్లు, పాటలు, టీజర్లు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి.. ఇక అంతే కాదు దేవి శ్రీ ప్రసాద్ చేసిన ప్రతి పాట కూడా అభిమానులలో మంచి నమ్మకాన్ని క్రియేట్ చేసింది. ఇకపోతే ఈ సినిమా చివర్లో అల్లు అర్జున్ తో సమంత ఐటమ్ సాంగ్ లో స్టెప్ లు వేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే తాజాగా స్పెషల్ ఐటమ్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఇందులో సమంత ఐటమ్ సాంగ్ లో మెరిసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ పాట ఊ అంటావా..? ఊ ఊ అంటావా .? చంద్రబోస్ లిరిక్స్ అందించగా దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను ఫోక్ సింగర్ మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహన్ గానాలాపణ చేశారు. ఈమె బోల్ బేబీ బోల్ వంటి సింగింగ్ షోలలో కూడా అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ తో కూడా తనదైన శైలిలో అందర్నీ ఆకట్టుకుంటోంది.
ఇక జార్జి రెడ్డి సినిమాలో కూడా ఒక పాట పాడిన ఈ అమ్మాయి ఇప్పుడు పుష్ప సినిమాలో ఏకంగా ఐటమ్ సాంగ్ పాడడంతో అందరు ఈమెపై ఫోకస్ పెట్టారు. ఇక ఇలాంటి పాటను పాడటం అంటే అంత ఈజీ కాదని అర్థం అవుతోంది. ఇక ఏది ఏమైనా ఈ పాట తో ఆమె మరో స్థాయిని చేరుకుంటుందని చెప్పవచ్చు.