యంగ్ అండ్ టాలెంట్ హీరో రాజ్ తరుణ్, కశీష్ ఖాన్ హీరో హీరోయిన్లుగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ సినిమా అనుభవించు రాజా. ఈ సినిమాని నాగార్జున మేనకోడలు సుప్రియ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మించడం జరిగింది. ఈ సినిమా గత నెల నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే అలరించింది.
అయితే తాజాగా ఈ సినిమా ఓటిటీలో విడుదలయ్యేందుకు సిద్ధమయింది. ఆహాలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ నేను పెడతాలే ఊర్లో ఆవారాగా తిరిగే బంగార్రాజు గా మరియు సిటీలో సిన్సియర్ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేసేవాడు గా కనిపిస్తాడు. డిసెంబర్ 17 నుంచి ఈ సినిమా ఆహా లో అందుబాటులోకి వస్తోంది. ఇక ఈ సినిమా థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే త్వరలోనే ఆహా లో చూడవచ్చు. ఇక ఈ సినిమా కూడా రాజు తరుణ్ ను కాపాడలేక పోయింది.