శ్యామ్ సింగరాయ్.. ప్రీ రిలీజ్ వేడుకకి డేట్ ఫిక్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

 నేచురల్ స్టార్ నాని హీరో గా రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ ఈ సినిమాలో సాయి పల్లవి , కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయిన్పల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.


ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ ను చిత్ర యూనిట్ చాలా వేగవంతం చేయడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించి ప్రి రిలీజ్ వేడుక నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ సినిమా వేడుకను డిసెంబర్ 14 వ తేదీన. సాయంత్రం 5 గంటలకు వరంగల్ లోని రంగలీల మైదానంలో జరుపనున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం.. ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు అభిమానులు.

Share.