బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు సింపుల్ గా పెళ్లి చేసుకుని రిసెప్షన్ చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతే కాదు ఆ ఫోటోలను, వీడియోలను వేరే వెబ్సైట్ వాళ్ళకు కూడా మంచి ధరకు అమ్ముకోవడం గమనార్హం. ఇప్పటికే గతంలో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లు ఇలా చేశారు. తాజాగా విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలకు తమ పెళ్లి ఫోటోలను, వీడియోలను బడా ఓటీటీ సంస్థకు అమ్ముకున్నట్లు సమాచారం.
ఇకపోతే విక్కీ – కత్రినా పెళ్లి చేసుకున్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ యాజమాన్యం ప్రమోషన్ కోసం ఉచితంగానే తమ హోటల్ ను కేటాయించింది అట. ఇకపోతే ట్రావెలింగ్ , సెక్యూరిటీ ఇలా తదితర విషయాలలో కత్రినానే డిసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇలాంటి అన్ని విషయాలలో విక్కీ చాలా తక్కువగా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరి పెళ్ళికి అయ్యే ఖర్చులో దాదాపు 75 శాతం వరకు ఖర్చులను కత్రినా చూసుకున్నట్లు సమాచారం.మిగిలిన 25 శాతం మాత్రమే విక్కీ ఖర్చు చేశారట.