రాజమౌళి కాళ్ళు పట్టుకోబోయినా అలియా భట్.. కారణం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

డైరెక్టర్ రాజమౌళి సారధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా RRR . ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ముఖ్యంగా అలియాభట్, ఓలివియా మోరీస్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లలో చాలా స్పీడ్ గా చేస్తోంది.

నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ చూసిన వారంతా రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ సమయంలో రాజమౌళి, ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవగన్, దానయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి, అలియా భట్ పక్కన కూర్చున్నారు. ఈ సమయంలోనే ఆలియా భట్ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలనుకుంది. కానీ ఆ సమయంలోనే రాజమౌళికి ఆలియా భట్ కాళ్లు తగిలింది. కానీ అలా తగిలాయి కదా అని ఆలియా భట్ ఊరుకోకుండా ఏ మాత్రం గర్వం లేకుండా ఆలియాభట్ రాజమౌళి కాళ్లకు దండం పెట్టింది.కానీ రాజమౌళి వద్దని చెప్పి ఆపేసాడు.

Share.