సమంత ఎంతో గొప్ప నటి అని అందరికీ తెలిసిందే.తెలుగు , తమిళ భాషా చిత్రాలలో నటించి మంచి పేరు కూడా సంపాదించుకుంది. అంతేకాదు ట్రెండ్ గా మారిన ఓ టీ టీ లోకి కూడా అడుగు పెట్టి అందరి మన్ననలు పొందింది. తెలుగు, తమిళ్ ,బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. ఇకపోతే మన భారతదేశ బిగ్గెస్ట్ హిట్ వెబ్ సిరీస్ అయినటువంటి “ది ఫ్యామిలీ మాన్ 2” సిరీస్ లో రాజీ అనే పాత్రలో నటించి తనలోని ఇంటెన్స్ నటిని ప్రతి ఒక్కరికీ పరిచయం చేసింది.
తన ఫస్ట్ అటెంప్ట్ లోనే తనలోని కొత్తదనాన్ని ది బెస్ట్ ని సమంతా ఇచ్చేసింది.అందుకే ఇప్పుడు ఆమెని ఓటిటి నుంచి ది బెస్ట్ నటుల ఫీమేల్ జాబితాలో ఈ సిరీస్ కి గాను అవార్డు లభించింది. దీనిని ఫిల్మ్ ఫేర్ వారు అధికారికంగా ప్రకటించగా సామ్ వారికి థాంక్స్ చెప్పింది. మరి ఈ హిట్ సిరీస్ ని చూడాలి అనుకునే వారు అమెజాన్ ప్రైమ్ వీడియో లో చూడవచ్చు.
Thankyou @filmfare 🙏 https://t.co/ix7g7eyeDQ
— Samantha (@Samanthaprabhu2) December 9, 2021