పుష్ప ప్రి రిలీజ్ డేట్ లాక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం పుష్ప. చాలా క్రేజ్ అంటే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమాని రెండు విభాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిన విషయమే. మొదటి భాగాన్ని ఈనెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమాల పుష్పరాజ్ పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన ఫోటోలు, వీడియోలో ప్రేక్షకులను బాగా అలరించాయి.

ఇటీవల విడుదలైన చిత్రం ట్రైలర్ సైతం ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్, విలన్ పాత్రలో నటిస్తుండగా.. సునీల్, అనసూయ వంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప సినిమాకి సంబంధించి ప్రి రిలీజ్ వేడుక పై తాజాగా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈనెల 12వ తేదీన ప్రి రిలీజ్ వేడుకలు జరపనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.

Share.