వెంకీ కుడుముల దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ విన్నర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ టైటిల్ గెలిచిన అభిజిత్ బిగ్ బాస్ తో చాలా క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ , ఆ పాపులారిటీని వాడుకోవడంలో వెనుక బడ్డానని అనుకున్నారు..కానీ ఆయన జాలీ ట్రిప్ లతో తన అభిమానులను సోషల్ మీడియా ద్వారా అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫైనల్ గా రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకటి అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వెబ్ సిరీస్ లో 8 ఎపిసోడ్స్ ఉండగా.. ఒక ఎపిసోడ్లో అభిజిత్ లీడ్ రోల్ లో కనిపిస్తాడని సమాచారం.

Bigg Boss 4 Telugu: Aha has an offer for Abhijeet?

తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా అభిజిత్ ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఛలో, భీష్మ వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం అయితే మెగా హీరోలతో సినిమా చేసే ఆలోచనలో ఉన్న వెంకీ కుడుముల, ఇప్పుడు బిగ్బాస్ సీజన్ ఫోర్ విన్నర్ అయినటువంటి అభిజిత్ తో సినిమా ప్లాన్ చేశాడని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇదే గనుక జరిగితే అభిజిత్ కెరీర్ మంచి ఊపు అందుకునే అవకాశం ఉంటుంది.

Share.