ప్రస్తుతం భారతదేశ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఇకపోతే బాహుబలి సినిమా తర్వాత ఈయన రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసాడ.. మొన్నటివరకు రూ.100 కోట్లకు తగ్గకుండా ఆఫర్ చేసిన ప్రభాస్ , ప్రస్తుతం రూ. 150 కోట్లకు పెంచినట్లు సమాచారం. ఇకపోతే ప్రభాస్ సినిమాల ద్వారా తనకు వచ్చిన ఆదాయాన్ని రియల్ వెంచర్స్ లో ఇన్వెష్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా ముంబైలో ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ప్రభాస్ హైదరాబాదులో కూడా మరొక విల్లాను కట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రదేశంగా గుర్తింపు పొందిన నానక్ రామ్ గూడలో రెండు ఎకరాల ను 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఆ రెండు ఎకరాల లో ప్రభాస్ తనకు నచ్చినట్టుగా ఒక అందమైన విల్లాను నిర్మించుకుంటున్నారు అట . ఇక ఆ ఇంటి నిర్మాణం కోసం ఏకంగా రూ. 80 కోట్ల వరకు ఖర్చు చేయనున్నాడని సమాచారం.. అంటే ఇక మొత్తంగా చూసుకుంటే ఆ ఇంటి కోసం ఏకంగా రూ. 200 కోట్లను వెచ్చించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.