సినీ ఇండస్ట్రీలో నాగచైతన్య,సమంత కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 2వ తేదీన వీరు విడిపోతున్నాంమని తెలియజేశారు. ఈ మాటతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ, అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే వీరిద్దరు విడిపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుంది అనే విషయం మాత్రం వీళ్ళిద్దరికే తెలుస్తుంది అని చెప్పవచ్చు. వీరిద్దరు ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
కానీ వీరిద్దరు విడిపోయిన విషయం మాత్రం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఎవరు ఎవరు విడిపోయి ప్రశాంతంగా తమ పనుల్లో బిజీగా అయిపోయారు. అయితే సమంత మాత్రం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ట్రోల్ కి గురవుతూనే ఉన్నది. కానీ ఇటీవల సమంత ఫ్రెండ్ అయినటువంటి ఒకరు వీరిద్దరిని తిరిగి కలపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా ఈ ఇద్దరి ఫ్యామిలీ లతో కూడా మాట్లాడుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత ఉన్నదనే విషయం మాత్రం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.