సినిమా తేడా కొడితే నా చావును చూస్తారంటున్న బన్నీ అభిమాని..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల అభిమానులు వారి హీరోల సినిమాల విషయం పై చాలా ఇష్టం పెంచుకుంటున్నారు అనే విషయం బాగా స్పష్టమవుతోంది. ఇందుకు కారణం స్టార్ హీరోల సినిమాలపై ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత సినిమా డిజాస్టర్ గా మిగిలితే తట్టుకోలేక చనిపోతాం అంటూ కూడా ట్వీట్లు చేయడంతో.. ఒకపక్క హీరోలకు భయం కలుగుతూనే ..మరోపక్క దర్శకులు కూడా ఏం జరుగుతుందో అని టెన్షన్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్నా మధ్య రాధే శ్యామ్ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదని ప్రభాస్ అభిమాని ఒక సూసైడ్ లెటర్ కూడా రాసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఇకపోతే నేడు తాజాగా పుష్ప సినిమాకు సంబంధించి ట్రైలర్ చూసి సినిమా మాత్రం తేడా కొడితే కచ్చితంగా నా చావుని చూస్తారు అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. అయితే మొదట సినిమా యూనిట్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ ను విడుదల చేయలేక పోతున్నామని చెప్పి అభిమానులను నిరాశపరిచినప్పటికీ, ఎట్టకేలకు ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది చూసిన కొంతమంది అభిమానులు చాలా బాగుంది అని కామెంట్లు చేస్తుండగా మరి కొంతమంది అంచనాలకు తగ్గట్టు గా ట్రైలర్ లేదని మరి కొంతమంది చెబుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి పుష్ప సినిమా కోసం ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ వీరాభిమాని చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది..

“గత రెండు సంవత్సరాల నుంచి పుష్ప సినిమా కోసం ఎదురు చూస్తున్నాను.. సినిమా ట్రైలర్ చూస్తే పెద్దగా ఆకట్టుకోవడం లేదు.. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న మాకు మీరు చేస్తున్న న్యాయం ఇదేనా.. సినిమా గనుక తేడా కొడితే కచ్చితంగా నా చావుని చూస్తారు” అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది.

Share.