ఇప్పటికే సింహ , లెజెండ్ , అఖండ సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్.. త్వరలోనే మరొక సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అయితే చాలామంది వీరిద్దరి కాంబినేషన్ లో అఖండ సీక్వెల్ వస్తే బాగుంటుందని చర్చలు కూడా మొదలయ్యాయి. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా రీమేక్ సినిమా వచ్చినా కూడా చాలా బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు.. కానీ అభిమానులకు మరింత ఆనందాన్ని ఇస్తూ బోయపాటి శ్రీను అలాగే బాలయ్య బాబు అటు సీక్వెల్ చేయకుండా ఇటు రీమేక్ చేయకుండా మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు..
దీని గురించి డిస్కషన్ పూర్తయి అడ్వాన్సులు కూడా ఇవ్వడం జరిగిపోయింది అట.. బాలయ్య బాబు తో ఎప్పటినుంచో ఒక సినిమా చేయాలని ఎదురు చూస్తున్న సితార ఎంటర్టైన్మెంట్ వారు ఈసారి కచ్చితంగా బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు ఇటీవల అడ్వాన్స్ కూడా ఇచ్చి లాక్ చేసినట్లు సమాచారం. బాలయ్య కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నిర్మాత నాగవంశీ కూడా ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారట. ఇక అన్నీ సెట్ అయితే మరో కొద్ది రోజుల్లో సెట్ మీదకు వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రాబోతోంది.