RRR : మూవీ నుంచి ఎన్టీఆర్ భీమ్ వీడియో వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రమల్టీ స్టారర్ మూవీ ఆర్. ఆర్. ఆర్. ఈ చిత్రం పై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు.ఇంకా రామ్ చరణ్ కి జోడీ గా అలియా భట్, ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ లు ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక వీరితో పాటు ఈ చిత్రం లో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరొక వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రం నుండి ట్రైలర్ ను డిసెంబర్ 9 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. థియేటర్ల లో ఈ సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ లోని కొన్ని సన్నివేశాల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా భీమ్ కి సంబంధించిన చిన్నపాటి వీడియో ను విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్ అంటూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ను వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

Share.