RRR ట్రైలర్ కారణంగా సెక్యూరిటీ కావాలంటూ లెటర్ వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం ప్రేక్షకులంతా ఎక్కువగా ఎదురు చూస్తున్నది కేవలం భారీ బడ్జెట్ సినిమా అయినటువంటి..RRR కోసమే. ఈ సినిమా నుంచి ట్రైలర్ కోసం సినిమా మేకర్స్.. భారీ ప్లానింగ్ వేసిన సంగతి మనకు తెలిసిందే. మొత్తం తెలుగు రాష్ట్రాలలో కొన్ని వందల సంఖ్యలో ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడానికి థియేటర్స్ ను రెడీ చేశారు.

అయితే ఈ సమయంలో తమ థియేటర్స్ కు సెక్యూరిటీ కావాలంట ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ కి చెందిన ప్రముఖ థియేటర్ సంఘం యాజమాన్య పోలీసులను ఆశ్రయించడం జరిగింది. రేపటి రోజున ఉదయం 9 గంటల నుండి..10 గంటల సమయంలో థియేటర్స్ కి ప్రొటెక్షన్ కావాలని ఒక లేటరు ద్వారా తెలియజేశారు.దీంతో ఆ లెటర్ కాస్త వైరల్ గా మారుతోంది. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేసినప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో.. వారి ధాటికి అద్ధాలు కూడా పగిలిపోయాయి అని తెలియజేశారు. అందుకే ఇప్పుడు ఈ భారీ సినిమా ట్రైలర్ కి అలాంటి దుస్థితి ఎదురు రాకూడదని ముందు జాగ్రత్త తీసుకున్నట్లుసమాచారం.

Share.