రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా సాయి పల్లవి , కృతి శెట్టి ,మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్.. ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు, టీజర్ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రముఖ మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రంలో స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాటకు సాహిత్యం అందించినట్లు చిత్రయూనిట్ సభ్యులు ఆయన కాలం చేసిన రోజున ప్రకటించారు..
అయితే ఈ పాట సిరివెన్నెల అంటూ సాగే ఈ పాటను ఆయన అంత్యక్రియలు జరిగిన రోజున రికార్డు చేసినట్టు కూడా చిత్రబృందం తెలిపింది… అంతే కాదు సిరివెన్నెల చివరి సంతకం అంటూ ఈ సినిమా నుండీ విడుదలైన ఈ పాట వినడానికి చాలా ఆహ్లాదకరంగా సాగింది. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.