నాగార్జున సినిమాలో నటించనున్న సీరియల్ నటి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్యకాలంలో ఎక్కువగా సీరియల్స్ లో నటిస్తున్న నటులు బాగా క్రేజ్ సంపాదించారు. అలా వెండి తెరపై మంచి అవకాశాలను కూడా దక్కించుకుంటున్నారు. మౌనరాగం సీరియల్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ప్రియాంక జైన్. తన మౌనంతోనే తెలుగు ప్రేక్షకుల బాగా ఆకట్టుకుంది. కేవలం ఒక్క సీరియల్స్ తోనే చాలా ఫేమస్ అయ్యింది ఇమే. ప్రస్తుతం ఈమె జానకి కలగనలేదు సీరియల్లో నటిస్తోంది.

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ టాప్ లిస్టులో ఇది కూడా ఒకటి. తాజాగా ఈమెకు ఒక క్రేజీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. నాగార్జునతో కలిసి నటించబోతోంది అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇదివరకే ఈమె కొన్ని సినిమాలలో కూడా నటించింది. గోలి సోడా, చల్తే చల్తే, వినరా సోదరా వీరకుమారా.. వంటి సినిమాల్లో కూడా నటించింది.

అప్పట్లో ప్రియాంక జైన్ ఇంటర్వ్యూలో తనకు నటించే అవకాశం వస్తే నాగార్జున తో నటించాలని ఉందని తెలిపింది.. ప్రస్తుతం బంగార్రాజు సినిమా తరువాత నటించే సినిమాలో ఈమెకు అవకాశం వచ్చినట్లు సమాచారం. మరి ఇది నిజమా లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share.