Kgf-2 తన షూటింగ్ ని ముగించేసిన ఆధీరా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇండియన్ బాక్సాఫీస్ ని షేర్ చేయడానికి సిద్ధమవుతున్న పలు సౌత్ సినిమాలలో.. కే జి ఎఫ్ మూవీ కూడా ఒకటి. ఈ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాని చాప్టర్-2 కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు.. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరి సినిమాలు రాఖీ ని ఎదుర్కొనే మోస్ట్ పవర్ఫుల్ పాత్ర ఆధీరా. ఈ క్యారెక్టర్ ని బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ చేస్తున్నాడు. ఇక అందుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పోస్టును కూడా తెలియజేశారు. ఈ సినిమాకి గానూ తన ఫైనల్ వర్క్ మొత్తం డబ్బింగ్ పూర్తి చేసినట్లు దర్శకుడు నిల్ తో కలిసి ఒక ఫోటో ని పెట్టి తెలియజేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Share.