విక్కీ – కత్రినా పెళ్లి ఫొటోస్ కోసం ఏకంగా వంద కోట్లు ఆఫర్ చేసిన ఓటీటీ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ స్టార్ సెలబ్రిటీలు గా గుర్తింపు తెచ్చుకున్న కత్రినాకైఫ్ అలాగే విక్కీ కౌశల్ వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే వీరు తమ పెళ్లికి వచ్చే అతిధులకు కొన్ని షరతులు విధించారు. ఎవరు మొబైల్స్ తీసుకు రాకూడదు అని, అనుమతి లేకుండా ఫోటోలు తీయకూడదని ఇలా రకరకాల షరతులు విధించారు. దీంతో వీరి పెళ్లి ఫోటోలు కానీ, వీడియోలు కానీ సామాన్యులు చూసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఒక బడా మీడియా సంస్థ కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ,వీడియోలను తమ మీడియా సంస్థలో ప్రచారం చేస్తామంటూ చెప్పడం తో పాటు ఈ జంటకు ఏకంగా వంద కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారట..

ఇక వీరి పెళ్లి వీడియో లను స్ట్రీమింగ్ చేయడానికి ఒక బడా మీడియా సంస్థ ఏకంగా 100 కోట్ల రూపాయలను ఆఫర్ చేయడం తో.. ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ కి దక్కని రేంజ్ లో వీరికి బంపర్ ఆఫర్ దక్కడం గమనార్హం. కత్రినా – విక్కీ కూడా తమ పెళ్లిని బిజినెస్ గా మార్చుకోవడం సినీ ఇండస్ట్రీలో అందరికీ షాక్ గా మారిందట..

Share.