సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికి తెలిసిందే.. అయితే ఇప్పుడు జబర్దస్త్ లో ఉండే మహిళా కమెడియన్లు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంటున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే.. మల్లెమాల సంస్థవారు హెచ్చరించినప్పటికీ పెద్దగా ఫలితం లేదు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా జబర్దస్త్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి వస్తున్న వార్తలపై మాధవి లత తనదైన శైలిలో స్పందించారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె సామాజిక అంశాల గురించి కూడా స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. కేవలం జబర్దస్త్ మాత్రమే కాదు అన్ని షో లు అలాగే తగలబడ్డాయి.. ముఖ్యంగా జబర్దస్త్ లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల విషయానికొస్తే రోజా, రష్మి, అనసూయ మాత్రమే కాదు కొత్తగా వస్తున్నటువంటి లేడీ ఆర్టిస్ట్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ ఆమె తెలిపింది.
అంతేకాదు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి.. ఒక ఆర్టిస్టుగా ముందుకు కొనసాగాలి అంటే 70% ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది..అది సినిమా అయినా టీవీ షో అయినా ఇబ్బందులు పడక తప్పదు అంటూ ఆమె తెలిపింది.