రామ్ చరణ్ మరదలి పెళ్లి వేడుకలో మెరవనున్న యానీ మాస్టర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రామ్ చరణ్ సతీమణి ఉపాసన చెల్లెలు అనుష్పాల పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇక ఈ వివాహ వేడుకలకు రామ్ చరణ్ విచ్చేసి, తన మరదలు పెళ్లి బాధ్యతను ఆయనే స్వయంగా చేసుకుంటున్నట్లు సమాచారం.తన మరదలు వివాహ వేడుకలలో సంగీత్ కి సంబంధించి.. బిగ్ బాస్ కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్ అయిన యానీ మాస్టర్ కు ఆ బాధ్యతలన్నీ అప్పగించి నట్లుగా తెలుస్తోంది. ఆమె పేరుప్రఖ్యాతులు పొందడం కోసం గత కొన్ని రోజుల ముందు నుంచే తన బృందంతో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం.

Upasana Konidela Sister Anushpala Marriage exclusive photos & Videos - YouTube
తన మీద ఉండే నమ్మకంతోనే రామ్ చరణ్ నాకు ఈ బాధ్యత అప్పగించారని ఆయనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేసింది.15 సంవత్సరాలుగా మీరు నాపై ఉంచుకున్న నమ్మకానికి ఇదేనా నిదర్శనం అంటూ రామ్ చరణ్ తో కలిసి దిగిన ఒక ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది యానీ మాస్టర్. ఈ సంగీత్ ఈవెంట్ కు సంబంధించి నిన్నటి రోజున దోమకొండ కోట సమీపంలోని జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వేడుకలు చూసేందుకు ఎంతో మంది ప్రముఖులు కూడా హాజరైనట్లు సమాచారం.

Bigg Boss Telugu 5: Anee Master In Upasana Sister Sangeeth Event - SakshiBigg Boss Telugu 5: Anee Master In Upasana Sister Sangeeth Event - Sakshi

Share.