సిరివెన్నెల మరణం ముందే చెప్పారంటున్న డైరెక్టర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

 హీరో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది సినిమాపై భారీగా అంచనాలను పెంచుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ రాబోతోంది.ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 7న సిరివెన్నెల రాసిన పాటను విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా చిత్రయూనిట్ ప్రకటించింది. సిరివెన్నెల రాసిన చివరి పాట కావడంతో ఈ పాట ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ పాటకు ఎంత ప్రాముఖ్యత ఉందో నాని, రాహుల్ సంకృత్యాన్ వీడియో సందేశం ద్వారా తెలియజేశారట.

రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. నవంబర్ 3న సిరివెన్నెలగారు నాకు ఫోన్ చేశారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో పాటను పూర్తి చేయలేకపోతున్నాను అని చెప్పారు. ఎలాగైనా సరే ఈ పాటను పూర్తి చేయండని మేం ఎంతో రిక్వెస్ట్ చేశాం. ఆ తెల్లారే ఆయన ఫోన్ చేసి మమ్మల్ని నిద్రలేపారు. ఆ రోజు దీపావళి. పల్లవి చెబుతాను రాసుకోండి అని అన్నారు. మహాభారతం బుక్‌పైన ఆరులైన్లు రాశాను.. అందులోని ఓ లైన్‌లో సిరివెన్నెల అని ఉంది. ఆయన నవ్వుతూ ఇదే నా చివరి పాట అవుతుందేమోనని అన్నారు. విధి అంటే ఇదేనేమో. ఆయన అంత్యక్రియలు జరిగిన రోజే ఆ పాటను రికార్డ్ చేశాం. ఈ పాటతో మరోసారి సిరివెన్నెలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం వచ్చినందుకు సీతారామశాస్త్రిగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.. అని అన్నారు.

Share.