యాంకర్ అనసూయ ఇంట విషాదఛాయలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ యాంకర్‌, నటి అనుసూయకు ఈ రోజు ఉదయం పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి సుదర్శన్‌ రావు(63) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తార్నాకలో కన్నుమూశారు.గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. పరిస్థితి విషమించి ఇవాళ తుదిశ్వాస విడిచారు. సుదర్శన్‌ రావు కాంగ్రెస్‌ పార్టీలో చాలాకాలం పాటు పనిచేశారు. రాజీవ్‌ గాంధీ హయాంలో యూత్‌ కాంగ్రెస్‌ పబ్లిసిటీ సెక్రటరీగా వ్యవహరించారు. ఆయన మృతితో అనుసూయ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.

Anasuya's Father Dies Of Cancer -
అనసూయ ఒకవైపు జబర్దస్త్లో యాంకర్ గా కొనసాగుతూనే మరోపక్క సినిమాలలో మంచి మంచి అవకాశాలు కొట్టేస్తా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈమె పుష్ప పాన్ ఇండియా సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ఆమె మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా అనసూయ తండ్రి మరణం అందరికీ షాక్ అనిపిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు , బుల్లితెర ప్రముఖులు అనసూయ తండ్రి మృతికి సంతాపం తెలుపుతున్నారు.

Share.