భీమ్లానాయక్ మూవీలో రానా భార్య గా నటించింది ఎవరో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ.. అందులో పవన్ కళ్యాణ్-దగ్గుబాటి రానా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్ సినిమా కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.ఈ చిత్రానికి డైరెక్టర్ కె సాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయకులుగా నిత్యా మీనన్, మలయాళ కుట్టి సంయుక్త మీనన్ నటిస్తున్నారు. అయితే ఈ సంయుక్త మీనన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మలయాళం లో విడుదలైన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో హీరోల భార్యలకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ తెలుగు వర్షంలో మాత్రం వారికి ప్రాధాన్యత ఉండేలా త్రివిక్రమ్ మార్పులు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు నిత్యామీనన్ జోడీగా.. రానాకు సంయుక్త మీనన్ జోడి గా కనిపించనున్నారు. సంయుక్త మీనన్ ఇప్పుడిప్పుడే తమిళ, మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకుంది. 2016లో పాప్ కార్న్ అని మలయాళం మూవీ తో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా మలయాళంలోనూ సినిమాలు చేస్తూ ఉండేది. ఆ తర్వాత తమిళ్ లో కూడా రెండు మూడు సినిమాల్లో నటించింది కానీ అక్కడ అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు తెలుగులో నటిస్తోంది.

Share.