అఖండ సినిమా చూస్తూ మరణించిన బాలయ్య అభిమాని..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలయ్య బాబు హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందించిన చిత్రం అఖండ. ఈ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్-2 వ తారీకున విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అప్పటినుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా కూడా బాగా దూసుకెళ్తోంది. దీంతో బాలకృష్ణ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే ఒక చేదు వార్త అందరినీ కలవరపెడుతోంది.

బాలయ్య వీరాభిమాని, ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్తి రామకృష్ణ అఖండ సినిమా చూస్తూ మరణం చెందాడు. రాజమండ్రి శ్యామల థియేటర్ లో అఖండ సినిమా చూస్తూ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో థియేటర్ యాజమాన్యం అప్రమత్తమై దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించారని అని సమాచారం. సినిమా చూస్తున్న సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రామకృష్ణ మృతి చెందినట్లు తెలియజేశారు. దీంతో బాలకృష్ణ అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలిపారు

Share.