బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి, కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేస్తోంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా పూర్ణ కీలక పాత్ర చేస్తూ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచారు. ఇక ఓ మోస్తారు అనుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది అని చెప్పవచ్చు. కనీ వినీ ఎరుగని రీతిలో బాలకృష్ణ కెరియర్ లో ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్ ఓపెన్ చేసిన ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు చెప్పుకోవడమే కాకుండా థియేటర్లలో క్యూ కడుతున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ కు ధీటుగా పోటీపడుతూ విలన్ పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన శ్రీకాంత్. శ్రీకాంత్ తో పాటు మరొక ఆర్మీ ఆఫీసర్ అయిన నితిన్ మెహతా కూడా పోటీపడి నటించారని చెప్పవచ్చు. మొన్నటి వరకు హీరోగా చూసిన శ్రీకాంత్ ను అఖండ సినిమాలో ఒక్కసారిగా విలన్ గా చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో విలన్ పాత్ర కు నిర్మాతల నుంచి శ్రీకాంత్ ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే విషయానికి వస్తే.. సుమారుగా కోటికి పైగా ఆయన పారితోషకం అందుకున్నారట. ప్రస్తుతం ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.